శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన

జీవితంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు అతి దుర్భరమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. సమస్యలు .. ఆపదలు .. అనారోగ్యాలు పలకరించినప్పుడు, ఆర్ధిక పరమైన స్థోమత బాగుంటే మిగతా వాటిని ఎదుర్కునే ధైర్యం ఉంటుంది. ఆర్ధిక పరమైన బలం లేనప్పుడు మనిషి మరింత బలహీనుడిగా మారిపోతాడు. అందుకే ఆర్థికపరమైన సామర్థ్యం కోసం ఎవరికివారు తమవంతు కష్టపడుతుంటారు.

ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ప్రీతి కలిగేలా ఆరాధించాలి. శుక్రవారం అనేది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అనే విషయం తెలిసిందే. ఆ రోజున అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి .. గులాబీలతో అర్చించి, ఆ తల్లికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆర్ధిక పరమైన సమస్యలు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

More Bhakti Articles