: రామ్ చరణ్ 'జంజీర్' ట్రైలర్ ఎల్లుండి విడుదల
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటించిన తొలి హిందీ చిత్రం 'జంజీర్'కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. హక్కుల విషయంలో నిర్మాత అమిత్ మెహ్రా, అతని సోదరుల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది. ఈ సినిమాను తమ తండ్రి పేరిట నెలకొల్పిన ప్రకాశ్ మెహ్రా బ్యానర్ పై విడుదల చేయాలని అమిత్, అతని సోదరులు ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్లుండి 'జంజీర్' మొదటి ప్రచారచిత్రాన్ని ఇంటర్నెట్ల్లో విడుదల చేయనున్నారు.
కాగా, రామ్ చరణ్ సరసన అందాలతార ప్రియాంక చోప్రా నటించిన ఈ రీమేక్ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎనభయ్యవ దశకంలో అమితాబ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన 'జంజీర్' చిత్రాన్ని అదే పేరుతో హిందీలోను, 'తుఫాన్' పేరుతో తెలుగు భాషల్లో రూపొందించిన సంగతి తెలిసిందే.