: హృతిక్, షారుఖ్ బాటలో రణబీర్ కపూర్


బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్... హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్ బాటలో నడువనున్నాడు. తాజాగా రణబీర్ కపూర్, దీపిక నటించిన 'ఏ జవానీ హై దివానీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు సాధిస్తోంది. దీంతో ఈ సినిమాను రూపొందించిన అయాన్ ముఖర్జీతో మరో సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలో ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వేకప్ సిద్' సినిమాలో కూడా రణబీర్ కపూర్ నటించాడు. ప్రస్తుతం బార్సిలోనాలో సెలవును అనుభవిస్తున్న అయాన్ ముఖర్జీ, ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో రణబీర్ ను సూపర్ హీరోగా చూపించనున్నాడని సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ లో క్రిష్, రావన్ వంటి సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తాజాగా ఆ సినిమాల బాటలో రణబీర్ కపూర్ తో సూపర్ హీరో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News