: ఫ్యాషన్ షోరూంలో రిచా గంగోపాధ్యాయ హల్ చల్
అందాలతార రిచా గంగోపాధ్యాయ నేడు బంజారాహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో హల్ చల్ చేసింది. ఆషాఢమాసం సందర్భంగా ఇక్కడి శ్రీజ ఫ్యాషన్స్ దుకాణంలో డిస్కౌంటు అమ్మకాలను రిచా ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం 'బాయ్' సినిమాలో నాగార్జున సరసన నటిస్తున్నానని, అంత పెద్ద హీరో పక్కన నటించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 'బాయ్' చిత్ర గీతాలతో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుందని ఆమె తెలిపింది.