: మాజీ ఎంపీటీసీ ఆస్తులను గిరిజనులకు పంచిన మావోలు


విశాఖ మన్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోలకు, స్థానికులకు వ్యతిరేకంగా పని చేస్తూ అక్రమ సంపాదనకు తెరతీశారని ఆరోపిస్తూ, మాజీ ఎంపీటీసీ ఆస్తులను గిరిజనులకు పంచిపెట్టేశారు. చింతపల్లి మండలం బలపం గ్రామంలో మాజీ ఎంపీటీసీ చిట్టిదొర, మరో ముగ్గురిపై దాడి చేసి చిట్టిదొర ఆస్తులను గిరిజనులకు పంచేశారు. చాలా కాలంగా చిట్టిదొరను మావోలు హెచ్చరిస్తూ వస్తున్నారు. చిట్టిదొర బాక్సైట్ తవ్వకాలకు మద్దతు పలుకుతున్నారని పలుమార్లు ఆరోపించిన మావోలు, తాజాగా అతనిపై దాడికి తెగబడి ఆస్తులు పంచేశారు.

  • Loading...

More Telugu News