: సామాన్యులకు త్వరగా స్వామి దర్శనం: టీటీడీ కొత్త ఈవో గోపాల్
సామాన్యులకు త్వరగా శ్రీవారి దర్శనం లభించేలా కృషి చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఈవోగా నియమితులైన ఎంజీ గోపాల్ చెప్పారు. స్వామివారికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. టీటీడీ ఈవో బాధ్యతలను శనివారం స్వీకరిస్తానని ఈ రోజు తిరుమల వచ్చిన ఆయన మీడియాకు చెప్పారు. 1983 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గోపాల్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు.