: మంత్రి సునీత ఇంటివద్ద ఉద్రిక్తత


తమ సమస్యలను పరిష్కరించాలంటూ వికలాంగులు నేడు మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో, ఆమె నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో మంత్రి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన వికలాంగులు తమకు అందిస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేయిదాటుతుండడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో, వికలాంగులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు వికలాంగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News