: శ్రీవారికి ఇస్రో చైర్మన్ కృతజ్ఞతలు
ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఈ ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయం సాధించడంతో స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జీఎస్ ఎల్ వీ వాహక నౌకను షార్ నుంచి ప్రయోగిస్తామని దర్శనానంతరం రాధాకృష్ణన్ ఆలయం వెలుపల మీడియాకు చెప్పారు.