: భవన నిర్మాణాల్లో చైనా అదుర్స్
చైనా భవన నిర్మాణ కౌశలం ఇప్పుడు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తోంది. చైనాలో ఆరురోజుల క్రితం ప్రారంభించిన ఒక భవన నిర్మాణ మొత్తం ప్రపంచ దేశాల్లోనే పేరొందిన నిర్మాణాల్లో తలమానికంగా నిలుస్తుందని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా భవన నిర్మాణ కౌశలాన్ని ప్రశంసిస్తున్నాయి.
చైనా ఆరురోజుల క్రితం 'ది న్యూ సెంచురీ గ్లోబల్ సెంటర్' అనే భవనాన్ని ప్రారంభించింది. ఈ భవనం మామూలు భవనాల్లాంటిది కాదు. ప్రపంచలోనే చాలా పెద్దది. అయితే ఎత్తు విషయంలో కాదు. ఇది ఎత్తుగా లేకున్నా కూడా ప్రపంచంలోనే దీన్ని తలదన్నే భవనాలే లేవంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ భవంతి 500 మీటర్ల పొడవు, 400 మీటర్ల వెడల్పుతో వంద మీటర్ల ఎత్తుతో సుమారు 1.7 మిలియన్ చదరపు మీటర్ల స్థలంలో ఈ భారీ భవనాన్ని నిర్మించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ భవంతి అమెరికా రక్షణ స్థావరం 'పెంటగాన్' భవంతికన్నా మూడు రెట్లు పెద్దది. అలాగే ఆష్ట్రేలియాలోని 'సిడీ ఒపెరా హౌస్' లాంటివి ఓ 20 నిర్మాణాలను ఈ చైనా భవంతిలో అమర్చేయవచ్చట. ఇంత పెద్ద భవంతిని చైనాలోని సియాచిన్ ప్రావిన్స్‌లోని చెన్‌గ్డులో నిర్మించారు. ఈ అందమైన, అద్భుతమైన భవంతిలో బిజినెస్ సెంటర్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు, ఇంకా స్విమ్మింగ్‌ఫూల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. పశ్చిమ చైనాలోనే దీన్ని ఒక పెద్ద వ్యాపార, సాంస్కృతిక రాజధానిగా మార్చాలన్నదే చైనా లక్ష్యమట!