: వాచ్‌ఫోన్‌ వస్తోంది!


యువత ఇప్పుడు చేతికి సమయాన్ని తెలిపేందుకే కాదు అలంకరణగా కూడా నేడు వాచీలను ఉపయోగిస్తున్నారు. అయితే అదే వాచీతో చక్కగా మాట్లాడగలిగితే... అలాంటి వాచీఫోన్‌ను తయారు చేశారు. ఈ వాచీఫోన్‌తో చక్కగా మాట్లాడొచ్చు, ఎస్‌ఎంఎస్‌లు పంపొచ్చు.

అంకిత్‌ ప్రధాన్‌, పవ్‌నీత్‌ సింగ్‌పురి, అపూర్వ సుకంత్‌, 17 ఏళ్ల కుర్రాడు సిద్ధాంత్‌ వాట్స్‌ అనే నలుగురు భారతీయ యువకులు కలిసి ప్రపంచంలోనే మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ వాచీని తయారు చేశారు. ఈ వాచీఫోన్‌లో చక్కగా మనం ఫోన్‌ చేసి అవతలివారితో మాట్లాడొచ్చు, ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపొచ్చు కూడా. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్లో అండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌ ఉన్నాయి. రెండు అంగుళాలుండే స్క్రీన్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో రెండు మెగాపిక్సెల్‌ కెమెరా, జీపీఎస్‌, వైఫై, బ్లూటూత్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో 16 జీబీ మెమరీ సామర్ధ్యం కూడా ఉంది. నేటి యువతకు కావాల్సిన పలు సౌకర్యాలను కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ వాచీ నిజంగా సూపర్‌ కదూ!

  • Loading...

More Telugu News