: తక్కువ ఛార్జింగ్‌తో ఎక్కువ మన్నిక


సెల్‌ఫోన్‌ బ్యాటరీలు కొన్ని త్వరగా చార్జింగ్‌ తగ్గిపోతుంటాయి. అయితే తక్కువకాలం పాటు మీ సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తే మీ ఫోన్‌ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికయ్యే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు.

ఎరిక్‌ లీమర్‌ అనే సాంకేతిక నిపుణుడు మన సెల్‌ఫోన్‌ బ్యాటరీ గురించి ఈ విషయాలను వివరించారు. మనం ఫోన్‌ ఛార్జింగ్‌ చేసే సమయంలో దాన్ని బ్యాటరీఫుల్‌ అని వచ్చే వరకూ ఛార్జింగ్‌లో ఉంచకుండా తక్కువ కాలం ఛార్జింగ్‌ చేయాలని అప్పుడే బ్యాటరీ ఎక్కువ కాలం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే ఛార్జింగ్‌ తగ్గుదల పూర్తిగా జీరో స్థాయికి పడిపోకుండా కూడా చూసుకోవాలని లీమర్‌ చెబుతున్నారు. మనం సెల్‌ఫోన్‌ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేయడం లేదా దాన్ని పూర్తిగా వినియోగించడం లాంటివి చేయడం వల్ల బ్యాటరీ బాగా దెబ్బతింటుందని తెలిపారు. అలాగే ఛార్జింగ్‌ పూర్తయిన తర్వాత కూడా ఫోన్‌ను కరెంటుకు అనుసంధానించడం వల్ల బ్యాటరీకి ఎక్కువ నష్టం కలుగుతుందని కూడా లీమర్‌ హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News