: మనం నివసించేందుకు బోలెడన్ని గ్రహాలు!
విశ్వంలో మానవుడు నివసించేందుకు ఆవాసయోగ్యమైన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇటీవల కనుగొన్న ఒక పాలపుంతలో మన భూమిలాంటి గ్రహాలు ఉండే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు భావించారు. అయితే మన పాలపుంతలోనే మన భూమిలాంటి జనావాసయోగ్యమైన గ్రహాలు బోలెడన్ని ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
షికాగో, నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ ఆధారంగా పాలపుంతలో మన భూమిలాగా మనుషులకు, ఇతర జీవజాలాలకు ఆవాసయోగ్యమైన గ్రహాలు సుమారు ఆరువేల కోట్ల వరకూ మన పాలపుంత గెలాక్సీలో ఉండి ఉండొచ్చని తేల్చారు. గతంలో ఈ విషయంలో శాస్త్రవేత్తలు వేసిన అంచనాలకన్నా ఇవి రెట్టింపుగా ఉన్నాయి.