: పాక్ ఉగ్రవాదుల ముప్పు ఇంకా ఉంది: షిండే


పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి భారత దేశానికి ఇంకా ముప్పు ఉందని హోం మంత్రి షిండే తెలిపారు. ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పలువురిని గుర్తించి భద్రతాదళాలు అరెస్టు చేశాయని, అయినప్పటికీ వారి నేతలు ఇంకా చాలా మంది ఉన్నారని అన్నారు. పాక్ ఉగ్రవాద సంస్థలు ఇంకా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయన్న షిండే, మత ఛాందస వాదులకు నిధులు అందుతూనే ఉన్నాయని అన్నారు. దీనికి తోడు వామపక్ష తీవ్రవాదం దేశానికి అంతర్గతంగా పెద్ద సవాలని తెలిపారు. దీన్ని ఎదుర్కోనేందుకు భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉందని అన్నారు. అయితే ఈ సమావేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీ చర్చించింది.

  • Loading...

More Telugu News