: భారతీయులపై సౌదీ రాజు ఉదారత
సౌదీలో అక్రమంగా ఉన్న భారతీయులపై సౌదీ రాజు అబ్దుల్లా జిజ్ సానుకూలంగా స్పందించి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు మరో నాలుగు నెలల పాటు ఆ దేశంలో ఆశ్రయం పొందొచ్చని తాఖీదు జారీ చేశారు. దాని ప్రకారం సౌదీలో అక్రమంగా నివాసముంటున్న తెలుగువారు నవంబరు నెలలోగా సౌదీని వీడాల్సి ఉంటుంది. తాజాగా నిథాకత్ నిబంధన కాస్త సడలించడంతో భారత ఎంబసీ ద్వారా ఉద్యోగమేళాలో పాల్గొని ఉద్యోగం సంపాదించుకుని మరోసారి సౌదీలో అధికారికంగా నివాసం ఉండే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో సౌదీలో అక్రమంగా నివసిస్తున్న తెలుగువారికి ఊరట లభించింది. ఈ మూడు నెలలు ఏదైనా పని చేసుకుని కనీసం ఛార్జీల మేరకైనా సంపాదించుకుని స్వదేశం చేరే వెసులుబాటు కలిగింది.