: చంద్రబాబు డీఎన్ఏ ఎక్కడిదో చెప్పాలి: పేర్ని నాని


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్.. జగన్ పార్టీది కాంగ్రెస్ డీఎన్ఏ అని వ్యాఖ్యానించడంపై పేర్ని నాని స్పందించారు. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ డీఎన్ఏ కాదని చెప్పుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడి డీఎన్ఏ ఏంటో చెప్పాలని టీడీపీకి సవాల్ విసిరారు. ఆయన ఏ పార్టీనుంచి టీడీపీలోకి వచ్చారో వివరించాలని అన్నారు. ఇక బాబును వేనోళ్ళ కీర్తించే మోత్కుపల్లి నర్సింహులు 1999లో ఏ పార్టీ నుంచి గెలిచారో చెప్పాలని నాని ప్రశ్నించారు. విధానాలు నచ్చకపోతే పార్టీలు మారడం సాధారణమే అని చెప్పారు. జగన్ పేరు వింటే చాలు కాంగ్రెస్, టీడీపీలు భయపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News