: టాటా సలహాదారే కాదు.. పైలట్ కూడా!
'మా కొత్త పైలట్ రతన్ టాటా. ఆయనతో కలిసి ఢిల్లీవరకు పయనించాం. ఆడ్వయిజరే పైలట్ అయితే మరింత ఖర్చు తగ్గినట్టే కదా' ఇదీ ట్విట్టర్లో ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ వ్యాఖ్య. భారత్ లో ఎయిర్ ఏషియా సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో పౌరవిమానయాన శాఖా మంత్రి అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియాకు ప్రభుత్వం నుంచి త్వరగా నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుందని తెలిపారు. ముంబై నుంచి ఢిల్లీకి రతన్ టాటా పైలట్ అవతార మెత్తడంతో ఫెర్నాండెజ్ ట్విట్టర్లో ఆ వ్యాఖ్యలు చేశారు.