: తెలంగాణ అంశాన్ని టీడీపీ మెడకు చుడుతోన్న లగడపాటి
తెలంగాణ అంశంపై ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించాలని టీడీపీకి సూచిస్తున్నారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలంటే శాసనసభ తీర్మానం తప్పనిసరి అని, ఇక్కడ వీగిపోతే ఆ బిల్లును పార్లమెంటు కూడా ఆమోదించదని ఆయన వివరించారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించే విధానమే కీలకమని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రం ముక్కలవకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని చెబుతూ, రాష్ట్రవిభజన జరిగితే మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.