: పదవి కన్నా ప్రజలే మిన్న: కావూరి
ప్రజల మధ్య గడపడంలో ఉన్న ఆనందం ఏ పదవిలోనూ లేదని కేంద్ర జౌళి శాఖా మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఏలూరు వచ్చిన కావూరిని కార్యకర్తలు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ తాను పదవులు ఏనాడూ ఆశించలేదని, పార్టీకి కార్యకర్తగానే సేవలందించానని తెలిపారు. అయినా ప్రజలమధ్య గడపడం అత్యంత ఆనందదాయకమంటూ, ప్రస్తుతం తన ముందు రైతుల సమస్యలతో పాటు కోల్లేరు సమస్య సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. కొల్లేరులో ధ్వంసం చేసిన 7600 ఎకరాల చేపల చెరువులను పునరుద్ధరించడం, కాంటూరు 5 నుంచి 3 కు కుదించి 40 వేల ఎకరాలను కోల్లేరు వాసులకు పంపిణీ చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరిస్తే తాను మద్దతుగా నిలుస్తానని టీడీపీ నేత, కైకలూరు ఎమ్మెల్యే జైమంగళ వెంకటరమణ తెలిపారు.