: వినియోగదారుడా... తస్మాత్ జాగ్రత్త!


'నెస్ లే'... స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ పేరు తెలియని వారు అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల సంస్థల్లో అగ్రస్థానం ఈ కంపెనీదే. మన దేశంలో కాఫీకి పేరెన్నిక గన్న సంస్థ ఇది. తాజాగా ఈ సంస్థ ఐరోపా దేశాల్లో గుర్రపు మాంసం కుంభకోణంలో చిక్కింది. 

ఇటలీ, స్పెయిన్  దేశాల్లోని పలు సూపర్ మార్కెట్ల నుంచి తమ కంపెనీ సరఫరా చేస్తున్న 'బీఫ్ పాస్తా మీల్స్' ఉత్పత్తుల (బీఫ్ రివోలీ, బీఫ్ టోర్టెలిన్)ను నెస్ లే కంపెనీ హడావిడిగా తొలగించింది. అసలు దీనికి కారణమేమిటంటే... యూరోపియన్ దేశాల్లో 'రెడీ టు ఈట్' అంటూ తమ సంస్థ అమ్మే పాస్తా ఉత్పత్తుల్లో గుర్రాలకు చెందిన డీఎన్ఏలను గుర్తించడమే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. 

మంచి కంపెనీ...అంటే ప్రొడక్ట్... అని అందరం అనుకుంటాం. కంపెనీ పేరు చూసి ఏళ్ల తరబడి వాడుతుంటాం. అయితే ఎంత బడా కంపెనీ అయినా ఇకపై కాస్త జాగ్రత్తగా కొనుగోలు చేయాలని ఈ ఉదంతం చెబుతోందంటున్నారు విశ్లేషకులు.

  • Loading...

More Telugu News