: ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలోని ఏసే ప్రావిన్సులో నేడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1 గా నమోదైందని జకార్తాలోని ప్రకృతి విపత్తుల శాఖ తెలిపింది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కూలి ప్రజలు గాయపడ్డారు. అయితే, క్షతగాత్రుల, మృతుల వివరాలు పూర్తిగా అందాల్సిఉంది.