: జగన్ సీఎం అవుతారు: సబ్బం
వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమనీ అనకాపల్లి ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో కలుస్తారనేది సత్యదూరమన్న సబ్బం, 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి, తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన అన్నారు.