: వైఎస్సార్ కాంగ్రెస్ కు గద్దె గుడ్ బై
విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు. తల్లిలాంటి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తనను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఈ రోజు విజయనగరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. బాబూరావు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.