: పోలీస్ స్టేషన్లు మిషనరీ ఆసుపత్రుల్లా పనిచేయాలి: డీజీపీ


పోలీస్ శాఖలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నట్టు డీజీపీ దినేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై పోలీస్ స్టేషన్లు మిషనరీ ఆసుపత్రులను తలపించేలా పనిచేయాలన్నారు. సేవాభావం, అంకితభావం ఉట్టిపడేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో దినేశ్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లలో ఆతిథ్య వాతావరణం ఉండేది కాదని, ఇకనుంచి పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలి దశలో 90 స్టేషన్లలో ఈ సదుపాయం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని నిర్ణయించామని డీజీపీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News