: సగం రహదారులు ఎన్ డీయే పాలనలోనే: కాంగ్రెస్
కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ సర్కారు తన అఫిడవిట్ ద్వారా ఎన్డీయే పాలనకు కితాబిచ్చింది. ప్రస్తుతం మనదేశంలో ఉన్న జాతీయ రహదారుల్లో సగం బీజేపీ సారధ్యంలోని ఏన్డీయే పాలనలోనే నిర్మితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీని ప్రకారం 1980లో మనదేశంలో 29,023 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. 2012 నాటికి 76,818 కిలోమీటర్లకు జాతీయ రహదారుల అభివృద్ధి జరిగింది. అంటే 32ఏళ్లలో కొత్తగా 47,795 కిలోమీటర్ల రహదారులు నిర్మితమయ్యాయి. వీటిలో ఏన్డీయే ఐదేళ్ల పాలనా కాలం 1997 నుంచి 2002 వరకు 23,814 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అంటే 27ఏళ్ల కాలంలో(అత్యధిక కాలం కాంగ్రెస్ పాలనే) ఎన్నో ప్రభుత్వాలు కష్టపడి చేసిన జాతీయ రహదారుల అభివృద్ధిని ఎన్డీయే సర్కారు ఐదేళ్లలో చేసి చూపించింది. సత్పరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? దీనిని కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ సర్కారు నిజాయతీగా ఒప్పుకోవడం సంతోషం.
ఇక తొమ్మిదేళ్ల యూపీఏ పాలనలో వచ్చిన జాతీయ రహదారుల పొడవు 16,000 కిలోమీటర్లుగా ఉంది. సంజయ్ కులశ్రేష్ఠ అనే వ్యక్తి జాతీయ రహదారులపై వాహనదారుల ప్రాణరక్షణ, ప్రమాద సమయాల్లో వైద్యసాయం అందించేందుకు సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలతో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేసింది.