: చంచల్ గూడ జైలుకు ఏపీపీఎస్సీ సభ్యుడు సీతారామరాజు
పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాల ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేయిస్తానంటూ అక్రమాలకు దిగిన ఏపీపీఎస్సీ సభ్యుడు సీతారామరాజును హైదరాబాద్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితురాలు సంధ్య ఇచ్చిన వివరాల ఆధారంగా సీతారామరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ రోజు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.