: ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమారుని మృతిపై వీడని అనుమానాలు
శ్రీలంక సైన్యం 2009లో ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ను మట్టుబెట్టింది. అదే సమయంలో అతని 12 ఏళ్ల కుమారుని కూడా ఎదురుకాల్పుల్లో చంపినట్లు ఆ దేశ సైన్యం అప్పట్లో ప్రకటించింది.
అయితే తాజాగా కల్లమ్ మెక్రే అనే దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ సినిమా ప్రభాకరన్ కుమారునిది సైనిక హత్య అని ఆరోపిస్తోంది. ఇందుకు ఆధారాలుగా బంకర్ లో దాక్కుని ఉన్న ప్రభాకరన్ కుమారుని ఫొటో, అలాగే అతని ఛాతీలో బుల్లెట్లు దిగడంతో చనిపోయి పడున్న ఫొటోలను ఈ చిత్రంలో దర్శకుడు చూపారు.
దశాబ్దాల పాటు సాగిన ఎల్టీటీఈ పోరుకు ముగింపు పలకడానికి శ్రీలంక సైన్యం కావాలనే ఆ బాలుడ్ని చంపిందని యుఎన్ మానవ హక్కుల కమిషన్ ఆరోపిస్తోంది.
- Loading...
More Telugu News
- Loading...