: సోనియాగాంధీ చిత్రం మార్ఫింగ్.. అసభ్యకర వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ చిత్రాన్ని అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసి, వివాదాస్పద వ్యాఖ్యలతో దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త ఒకరిపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ లోని జలందర్ కు చెందిన సందీప్ భల్ల అనే బీజేపీ కార్యకర్త ఈ పని చేసినట్లుగా కాంగ్రెస్ కార్యకర్త సంజయ్ సెహ్ ఘల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ శర్మ ఖండించారు. తమ పార్టీ మహిళలను గౌరవిస్తుందని, ఇలాంటి చర్యలను క్షమించదని తెలిపారు. ఒకవేళ తమ పార్టీ కార్యకర్త ఈ పనికి పాల్పడినట్లు తేలితే అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.