: బస్సు బోల్తా.. 22 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు


డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలమీదకు తెచ్చింది. ఏలూరులోని ఒక కాలేజీ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ద్వారకా తిరుమల సమీపంలో బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విద్యార్థుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం విషాదకరంగా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నట్లుండి బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం రాకపోయినా డ్రైవర్ బ్రేక్ వేశాడని తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News