: రోదసిలో భారత పతాకం రెపరెపలు
దేశీయంగా రూపొందించిన తొలి నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నిన్న రాత్రి 11.41 నిమిషాలకు ఉపగ్రహాన్ని తీసుకుని పీఎస్ఎల్ వీ సీ-22 రాకెట్ నింగికెగసింది. కొంతసేపటికి రోదసిలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీని సాయంతో విమానాల గమనం, విపత్తుల సమాచారం మరింత కచ్చితంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటివి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలన్నది ఇస్రో లక్ష్యం. అందులో మొదటిది విజయవంతంగా ప్రయోగించింది.
ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో గతరాత్రి సూళ్లూరుపేటలోని షార్ లో సంబరాలు మిన్నంటాయి. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రధాని, రాష్ట్రపతి కూడా అభినందనలు తెలియజేశారు.