: అందరూ నా వాళ్లే: అల్లు అర్జున్
'అందరూ నా వాళ్లే'నని అల్లు అర్జున్ 'ఎవడు' సినిమా ఆడియో సందర్భంగా వ్యాఖ్యానించాడు. చరణ్ కు ఎవర్ గ్రీన్ హిట్ గా 'ఎవడు' నిలుస్తుందని అల్లు అర్జున్ తెలిపాడు. తన పాత్ర గురించి రకరకాల ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయని, అయితే తన పాత్ర కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. తానే రకంగా చరణ్ ను చూడాలనుకుంటున్నానో ఆ రకమైన పాత్రలో చూస్తున్నానని తెలిపారు. అందరూ తన మిత్రులు పని చేసిన ఈ సినిమా తెలుగు చరిత్రను తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.