: శాఖలన్నీ పొదుపు పాటించాలి


ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు పాటించాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఖర్చులపై ఆంక్షలు విధించడంతో పాటు, పొరుగు సేవల సిబ్బందిని తగ్గించుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే ప్రతిపాదనలు పంపొద్దని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అద్దె వాహనాల వినియోగం కనిష్ఠ స్థాయిలోనే కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పాటు విదేశీ పర్యటనలకు నిధులను మంజూరు చేయలేమని తెలుపుతూ, బడ్జెట్ కంటే అదనపు ఖర్చులు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News