: ఒడిసాలో కాంగ్రెస్ యువరాజు


అమ్మ సోనియా.. కాంగ్రెస్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేతిలో పెట్టడంతో రాహుల్ పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి అంకితమవుతున్నారు. మూడు రోజుల కిందటే ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యి అందిరికీ దిశానిర్దేశం చేసిన రాహుల్ తాను కూడా కార్యాచరణకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా రాహుల్ ఒడిసాలో సోమవారం అడుగుపెట్టారు. నిన్న సంబల్ పూర్ లో పర్యటించి పార్టీ నేతలు కొందరితో భేటీ అయిన రాహుల్, ఈ రోజు దక్షిణ ఒడిసా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. 2014 ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలు సాధించేందుకు ఇప్పటి నుంచే కష్టించి పని చేయాలని పంచాయతీ, తాలూకా నేతలకు సూచించారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించారు. రాహుల్ రాక తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఒడిసా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ చెప్పారు. 

రాహుల్ ఈ రోజు మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలతో భేటీ అయ్యి తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అన్నట్లు రాహుల్ త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లోనూ పర్యటించనున్నారు. 

  • Loading...

More Telugu News