: మోడీని నమ్ముకుంటే మట్టికరుస్తారు: చిదంబరం
వచ్చే ఎన్నికల్లో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని నమ్ముకుంటే బీజేపీ మరోసారి మట్టికరవడం ఖాయమని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. మోడీ విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదని, ఆయన ఏకాకిలానే కనిపిస్తున్నాడని చిదంబరం అన్నారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తన ప్రధాని అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకుంటే, ప్రజలు కూడా వారి నిర్ణయం వారు తీసుకుంటారని పేర్కొన్నారు.