: డాక్టర్ లాల్జీసింగ్ కు నాయుడమ్మ అవార్డు
ప్రతి ఏటా అందించే నాయుడమ్మ పురస్కారాన్ని ప్రముఖ జీవశాస్త్రవేత్త, బనారస్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ లాల్జీసింగ్ అందుకోనున్నారు. డీఎన్ఏ వేలిముద్రల పరిశోధనా నిపుణుడు డాక్టర్ లాల్జీ సింగ్ ను, 2012 సంవత్సరానికి గాను డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డుకి ఎంపిక చేసినట్లు నాయుడమ్మ ట్రస్టు వ్యవస్థాపకుడు విష్ణుమూర్తి తెలిపారు. ఫిబ్రవరి 16న తెనాలిలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు విష్ణుమూర్తి తెలిపారు.