: నాలుగేళ్ళ బాలుడు కిడ్నాప్.. ఏడు లక్షలు డిమాండ్
ప్రకాశం జిల్లాలో కిడ్నాపర్లు నాలుగేళ్ళ బాలుడిని అపహరించారు. పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్ష అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.7 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.