: ఆర్టీసీ సమ్మె పోటు
ఈ నెల 5 నుంచి ఆర్టీసీలో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్ వర్క్ షాపుల్లో నిరవధిక సమ్మె పాటించాలని ఈయూ ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ కార్మికులకు పెరగాల్సిన వేతన సవరణను వేగవంతం చేయాలని పద్మాకర్ డిమాండ్ చేశారు. అలాగే 240 రోజుల సర్వీసు పూర్తి చేసుకున్న ఒప్పంద కండక్టర్లు, డ్రైవర్లను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.