: జూలై నుంచి ఆన్ లైన్లో పీఎఫ్ సేవలు
ఉద్యోగులకు పీఎఫ్ సేవలు సులభంగా అందనున్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఖాతా బదిలీ చేసుకోవాలన్నా, ఖాతాను మూసేయాలనుకున్నా ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ దరఖాస్తును కూడా ఆన్ లైన్లోనే సమర్పించుకోవచ్చు. జూలై నుంచీ ఈ సేవలను అందుబాటులోకి తేవాలని ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. దీనివల్ల ప్రైవేటు రంగంలోని 5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఇక చెల్లింపుల కోసం పెండింగ్ లో ఉన్న 5.39 లక్షల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.