: అఖిల పక్ష సమావేశానికి మీరాకుమార్ పిలుపు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజుల్లో ఆరంభమవనుండగా, లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. బుధవారం జరగనున్న ఈ సమావేశంలో లోక్ సభను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పలు అంశాలపై చర్చించనున్నారు.
అన్ని పార్టీల సభాపక్ష నాయకులు, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సెషన్లలో ఇటలీ హెలికాప్టర్ల కుంభకోణం సహా పలు అంశాలపై యూపీఏ సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.