: పాక్ కోచ్ గా రమ్మని నన్నెవరూ అడగలేదు: ఇంజమామ్
పాకిస్తాన్ జాతీయ జట్టు బ్యాటింగ్ కోచ్ గా తాను ఎంపికయ్యానని వస్తున్న వార్తలను పాక్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ తోసిపుచ్చాడు. బోర్డు నుంచి ఎటువంటి సమాచారం తనకు రాలేదని చెబుతున్నాడు హక్. 'పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఆ విషయంలో ఎవరూ నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. చాలామంది నన్ను ఇప్పటికే అడుగుతున్నారు. కానీ అదేం లేదు' అంటూ సమాధానమిచ్చాడు హక్.