: అమెరికా అయినా అలుసే


అమెరికా ప్రపంచ వ్యాప్తంగా బాగా అబివృద్ధి చెందిన దేశాల్లో ముందుండే దేశం. అయినా అక్కడ ఆడవారిపై చిన్నచూపు ఎక్కువేనని తాజా అధ్యయనం చెబుతోంది. ఒకే పని అయినా మగవాళ్లతో పోల్చుకుంటే అక్కడ ఆడవారికి జీతం కాస్త తక్కువగానే ఉంటుందట.

నిజానికి మహిళలు తాము చేస్తున్న పనిలో మగవారికన్నా కూడా ఎక్కువగా లీనమై చేస్తుంటారు. అయినా కూడా ఒకే పనికి మగవారితో పోల్చుకుంటే ఆడవారికి జీతం తక్కువగా ఇస్తున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం ప్రకారం ఒక పనిచేస్తున్న మగవారు దానికి ఒక డాలర్‌ సంపాదిస్తుంటే అదే పని చేస్తున్న ఆడవారికి మాత్రం కేవలం 77 సెంట్లు మాత్రమే వస్తున్నాయట. ఇంత తక్కువ జీతం వస్తున్నాకూడా ఆడవారు పనిలో మాత్రం చక్కగా లీనమై చేస్తున్నారట.

ఈ అధ్యయనం ప్రకారం మగవారిలో కేవలం 28 శాతం మంది మాత్రమే పనిలో లీనమై చేస్తుంటే ఆడవారు 33 శాతం మంది దాకా కార్యాలయంలో తమ పనిలో లీనమై చేస్తున్నారట. అలాగే ఒకప్పుడు ప్రసవం అయ్యాక కేవలం ఇరవై శాతం మంది మహిళలు మాత్రమే పూర్తిగా పనిచేసేందుకు ముందుకు వచ్చేవారని అయితే ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరుగుతోందని ఈ అధ్యయనం చెబుతోంది.

  • Loading...

More Telugu News