: పదవి ఐదేళ్ళు.. పెదవి నూరేళ్ళు: డిప్యూటీ సీఎం
ప్రత్యేక తెలంగాణ కోసం గట్టిగా నినదించే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మరోమారు తన బాణీని వినిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సభలో..'పదవి ఐదేళ్ళు, పెదవి నూరేళ్ళు అంటూ.. మాట తప్పేది లేదు, తెలంగాణ వీడేది లేదు'అని ఉద్ఘాటించారు. ఇక, సీమాంధ్ర నేతలనుద్ధేశించి వ్యాఖ్యానిస్తూ.. 'మీ అస్థిత్వాన్ని మేం గౌరవిస్తాం, మా అస్థిత్వాన్ని మీరు గౌరవించండి' అని సూచించారు. పనిలోపనిగా టీడీపీపైనా విరుచుకుపడ్డారు రాజనర్సింహ. ఒక ఓటు రెండు రాష్ట్రాలని టీడీపీ మోసం చేసిందని విమర్శించారు.
తెలంగాణది 70 ఏళ్ళ ఉద్యమచరిత్ర అని చెప్పారు. 3,000 ఏళ్ళ గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం తెలంగాణ అని రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సమస్యలు లేకపోయినా కొందరు పనిగట్టుకుని అవాంతరాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమిదని ఆవేశంగా చెప్పారు.