: ఆంధ్రప్రదేశ్ ఏమీ ఆషామాషీగా ఏర్పడలేదు: మంత్రి శైలజానాథ్


రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తన సమైక్యవాదాన్ని మరోసారి ఘనంగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడలేదని, రాష్ట్రం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం విమానాశ్రయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోదని, భాషా ప్రయుక్త రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి ప్రవేశించిందని నొక్కి చెప్పారు. ఇక చిన్నరాష్ట్రాల వల్ల పురోగతి అసాధ్యమని అంటూ, కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న పిమ్మటే నిర్ణయం వెలిబుచ్చుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News