: పనిమనుషులకు డిప్లమా కోర్సు


మహారాష్ట్రలోని యశ్వంత్ రావు చవాన్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పనిమనుషుల కోసం నూతనంగా ఓ డిప్లమా కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో ఈ తరహా కోర్సు ఇదే ప్రథమం. ఏడాది వ్యవధి కలిగిన ఈ కోర్సుకుగాను వచ్చే నెల 15 నుంచి అడ్మిషన్లు ఆరంభమవుతాయని వర్శిటీ వర్గాలు తెలిపాయి. తొలిదశలో ఈ డిప్లమాను నాగ్ పూర్, నాసిక్, ఔరంగాబాద్, హింగోలి కేంద్రాల్లో ప్రవేశపెడతామని వర్శిటీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి శ్రీనివాస్ బెల్సరాయ్ పేర్కొన్నారు.

ఈ కోర్సులో భాగంగా ఇళ్ళలో పనిచేసే పనిమనుషులకు ఆధునిక గృహోకపకరణాల వినియోగం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపరేట్ చేయడం, చిన్నారుల ఆలనపాలన, వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, ప్రాథమిక గణితం, వర్తమాన వ్యవహారాలు, ప్రాపంచిక జ్ఞానం వంటి విషయాల్లో శిక్షణ ఇస్తారు. బలహీన వర్గాల మహిళలకు ఈ కోర్సు ఎంతగానో ఉపయుక్తమని బెల్సరాయ్ అన్నారు.

  • Loading...

More Telugu News