: 'రానాకు గాయం'పై ఘాటుగా స్పందించిన రాజమౌళి


'బాహుబలి' సినిమా కోసం రిహార్సల్స్ చేస్తూ గుర్రం మీదనుంచి కిందపడ్డ రానాకు గాయాలయ్యాయని, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారని నిన్న రాత్రి వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై చిత్ర దర్శకుడు రాజమౌళి ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. రానాకు అయినవి అతి స్వల్ప గాయాలని.. వాటిని గాయాలు అనడం కంటే 'కొద్దిగా గీసుకుపోయాయి' అనడం సరి అని పేర్కొన్నారు. తానే ముందు జాగ్రత్తగా అతన్ని వైద్యుడితో చెకప్ చేయించుకోమని సూచించానని రాజమౌళి వెల్లడించారు. 'రానాకు ప్రమాదం, గాయాలతో ఆసుపత్రిలో చేరిక'.. అంటూ పెద్దపెద్ద పదాలు వాడి ఆ యువ నటుడి కుటుంబాన్ని హైరానా పెట్టవద్దని మీడియాకు హితవు చెప్పారు. ప్రస్తుతం రానా భేషుగ్గా ఉన్నాడని ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చెప్పారు.

  • Loading...

More Telugu News