: నేపాల్ పాటి పోషణైనా భారత్ లో లేదాయె!
మనది అభివృద్ధి చెందుతున్న దేశమే. కానీ, అది అసమగ్ర అభివృద్ధి. ఆ ఫలాలు అందరికీ అందని మావిపండ్లలాంటివి. ప్రపంచంలో పోషాకాహార లేమితో బాధపడుతున్న చిన్నారుల్లో 40 శాతం మంది భారత్ లో ఉండడమే దీనికి నిదర్శనం. ఉండాల్సినంత బరువు లేని చిన్నారులు భారత్ లో అధికమని కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ మైక్రో న్యూట్రియెంట్ ఇనీషియేటివ్ అధ్యక్షుడు ఎంజీ వెంకటేష్ మన్నార్ చెప్పారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినప్పటికీ. ఆరోగ్యం, పోషకాహారం విషయంలో చాలా దారుణ స్థితిలో ఉందని తెలిపారు.
భారత్ కంటే నేపాల్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. చిన్నారులు అనీమియాతో బాధపడుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. భారత ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టినా అమలు సక్రమంగా లేదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలేమితో పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని వెంకటేష్ చెప్పారు. వెంకటేష్ కెనడా అత్యున్నత పౌరపురస్కారం 'ద ఆర్డర్ ఆఫ్ కెనడా' అందుకున్నారు.