: మృతులు పదివేలు కాదు...వెయ్యిమందే!: ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ వరదల్లో ఇప్పటివరకు 10,000 మందికి పైగా మృత్యువాత పడివుంటారని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ పేర్కొనడం పట్ల సీఎం విజయ్ బహుగుణ మండిపడ్డారు. ఏం తెలుసని ఆయన అలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వెయ్యిమంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆయన వెల్లడించారు. అందుకు రుజువుగా కేంద్ర హోం మంత్రి సుశీల కుమార్ షిండే ప్రకటనను ఉదహరించారు. షిండే ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. 900 మందికిపైగా చనిపోయారని ప్రకటించిన సంగతి తెలిసిందే.