: పరిహారం కోసం కూతురి ప్రాణం తీశాడు


మనిషిలోని రాక్షసత్వానికి ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి కాశ్మీర్ లో జరిగింది. ప్రభుత్వం నుంచి అందే పరిహారం కోసం కక్కుర్తిపడి నాలుగేళ్ల కూతురును కిరాతకంగా చంపేశాడో రాక్షస తండ్రి. ఆనక ఉగ్రవాదులు హత్య చేశారని నమ్మించి డబ్బులు కొట్టేయాలని అల్తాఫ్ అహ్మద్ ప్రయత్నం. ఇతడి దుర్మార్గ పథకాన్ని పోలీసులు కక్కించి కటకటాల్లోకి పంపించారు.

అల్తాఫ్ భార్య గ్రామ సర్పంచి. సర్పంచి అంటే సాధారణంగా పేద కుటుంబం అయి ఉండదు. కానీ, ఇతడు ప్రభుత్వం నుంచి అందే పరిహారం కోసం దారుణానికి తెగించాడు. కరుడుగట్టిన మనసుతో కూతుర్ని గొంతుకోసి చంపేశాడు. ఉగ్రవాదులే హత్య చేశారని నమ్మించేందుకు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లమని భార్యను పురమాయించాడు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ లో ఉగ్రవాదులు సర్పంచులను హత్య చేస్తూ, వారి కుటుంబాలపై దాడులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పనిలో పనిగా ఈ హత్య కూడా ఉగ్రవాదుల ఖాతాలోనే వేసేసి పరిహారం కొట్టేయాలనుకున్నాడు అల్తాఫ్. నేరం దాగదని తెలిసుండదు!

  • Loading...

More Telugu News