: అఫ్జల్ గురు సమాచారాన్ని సైట్ నుంచి తొలగించండి: ఫేస్ బుక్ కు ప్రభుత్వం ఆదేశం


ఇటీవలే ఉరిశిక్షకు గురైన ఉగ్రవాది అఫ్జల్ గురుపై ఫేస్ బుక్ లో ఉన్న సమాచారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 55 పేజీలు ఉన్న వివాదాస్పద సమాచారం తొలగించాల్సిందేనని ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది.

కాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పున:ప్రారంభానికి ముందు రోజే కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆ 55 పేజీల్లో అఫ్జల్ గురు ఫేస్ బుక్ ఫ్యాన్ పేజీలతో పాటు ఆయనకు మద్దతిచ్చే పలు గ్రూపులతో అనుసంధానమై ఉన్నఓ బహ్రెయిన్ జర్నలిస్ట్, కాశ్మీర్ పోర్టల్ కు చెందిన పేజీలు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News