: మరో విజయానికి సై అంటున్న భారత్


ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా నేడు వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆ దేశ జట్టుతో తలపడుతుంది. ఇంగ్లండ్ లో ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కరీబియన్లను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా తమ సొంత గడ్డపై భారత్ ను ఓడించి కసి తీర్చుకోవాలని వెస్టిండీస్ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో శ్రీలంకను ఓడించడంతో వారిలో ఆత్మవిశ్వాసం రెండింతలైంది. కానీ, వరుస విజయాలతో భారత జట్టు మంచి ఫామ్ లో ఉండడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. దీంతో ఈ సిరీస్ లో కూడా హాట్ ఫేవరేట్ భారతేనని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

విశేషమేమిటంటే, రెండు జట్ల కెప్టెన్లు చెన్నై సూపర్ కింగ్స్ లో సహ ఆటగాళ్లు కావడం. మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉండగా, బ్రావో జట్టు ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరూ తమ తమ జట్ల విజయం కోసం పావులు కదుపుతున్నారు. అలాగే భారతజట్టులోని విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో సహ ఆటగాళ్లు.

  • Loading...

More Telugu News