: చాంపియన్స్ ట్రోఫీ రద్దు.. టెస్ట్ చాంపియన్ షిప్ ఏర్పాటు
చాంపియన్స్ ట్రోఫీ ఇకపై ఉండదు. దీనిని రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల కిందట భారత్ ఇంగ్లండ్ గడ్డపై విజయఢంకా మోగించిన చాంపియన్న్ ట్రోఫీయే ఆఖరిది. దీనికి బదులుగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ను ప్రవేశపెడుతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2017లో తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఇంగ్లండ్ లో జరుగుతుందని, 2021లో రెండో టెస్ట్ చాంపియన్ షిప్ భారత్ లో జరుగుతుందని ప్రకటించింది.
అలాగే 2016లో జరిగే టీ20 ప్రపంచ కప్ భారత గడ్డపై జరుగుతుంది. దీంతో పాటు 2023లో జరిగే వన్డే వరల్డ్ కప్ సమరానికీ భారతే ఆతిథ్యమివ్వనుంది. 2016 నుంచీ ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచకప్ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది టీ 20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది.